నవీపేట్, బతుకమ్మ : రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ నిజామాబాద్ ఏరియా ఆఫీస్ ఆధ్వర్యంలో నవీపేట్ మండలం నవీపేట్ గ్రామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన, పప్పు ధాన్యాల స్వవలంబన మిషన్ పై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని నవీపేట్ లోని నవీపేట్ కిసాన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ లో రైతులకు వివరించి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్. సి. ఎఫ్. లిమిటెడ్ నిజామాబాద్ ఏరియామార్కెటింగ్ ఆఫీసర్ సునీల్ కుమార్, ఏవో నవీన్ కుమార్, చైర్మన్ ఆర్ పృథ్వీరాజ్, సీఓ అనీష్ రాజ్, ఆఫీస్ సిబ్బంది గడీల చంద్రశేఖర్ గ్రామ రైతులు పాల్గొన్నారు.
