27.3 C
Hyderabad
Friday, July 31, 2026

ఘనంగా సహ చట్టం -2005 20వ వార్షిక వారోత్సవాలు

Must read

📰 Generate e-Paper Clip

 ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డిలో సహ చట్టం – 2005, 20 వార్షిక వారోత్సవాలు  డిఎస్పి. ఎస్ శ్రీనివాసరావు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎల్లారెడ్డి పట్టణంలోని డి.ఎస్.పి కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహ చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ మాజీ ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి ఎం ఏ సలీం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్పి శ్రీనివాసరావు, సలీం లు కలిసి కేక్ కట్ చేసి రాష్ట్ర డైరెక్టర్ సలీం కు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ 12 అక్టోబర్ 2005లో అమలైన ఈ చట్టాన్ని ప్రజలు ఒక వజ్రాయుధము లాగా ఉపయోగించుకోవాలని అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కూడా 5 అక్టోబర్ 2025 నుండి 12 అక్టోబర్ 2025 వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టం 2005,, 20వ వార్షిక వారోత్సవాలను ఘనంగా నిర్వహించడం గర్వకారణం గా ఉందని తెలిపారు.  ఈ సందర్భంగా డిఎస్పి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎల్లారెడ్డి డివిజన్లోని అన్ని పోలీస్ స్టేషన్లలో సమాచార హక్కు చట్టం 2005 బోర్డులు ఉన్నాయని, వీటిపై ప్రజా సమాచార అధికారి పేర్లు ఉంటాయని ప్రజలు ఆయా పోలీస్ స్టేషన్ల ద్వారా వారి కావలసిన ఎఫ్.ఐ.ఆర్., చార్జిషీట్లను కూడా పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి సి.ఐ. రాజిరెడ్డి, లింగంపేట్ మండల సబ్ ఇన్స్పెక్టర్ దీపక్ కుమార్ మరియు సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ కామారెడ్డి జిల్లా సలహాదారులు దండగుల లింగమయ్య, షేక్ మదర్ పాష, జిల్లా ఉపాధ్యక్షులు మొహమ్మద్ ఇంతియాజ్, ప్రతినిధులు మహమ్మద్ మసూద్, యాదగిరి గౌడ్, శ్రీకాంత్,మోహన్ రెడ్డి, షేక్ అయూబ్, స్థానిక డిఎస్పి కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Celebrating the 20th Annual Week of the Co-Act -2005

More articles

Latest article