27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

సహ చట్టంపై ఉద్యోగులకు  అవగాహన ఉండాలి

Must read

📰 Generate e-Paper Clip

  • నార్త్ తహశీల్దార్ విజయ్ కాంత్ రావ్ 

 

నిజామాబాద్ సిటి, బతుకమ్మ : సమాచార హక్కు చట్టంపై ఉద్యోగులందరికీ పూర్తి అవగాహన కలిగి ఉండాలని నార్త్ తహశీల్దార్ విజయ్ కాంత్ రావ్ సూచించారు. నిజామాబాద్ నార్త్ తహశీల్దార్ కార్యాలయంలో  సమాచార హక్కు చట్టం 2005 వారోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నార్త్ తహశీల్దార్ విజయ్ కాంత్ రావ్  మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం గురించి దాన్ని ప్రాధాన్యత గురించి ఉద్యోగులకు వివరించారు. సమాచార హక్కు చట్టం ప్రకారం పి ఐ ఓ ,ఎ పి ఐ ఓ  పని చేయాలని తెలిపారు. దరఖాస్తుదారుకు నిర్ణీత సమయంలో సమాచారం ఇచ్చే విధంగా చూడాలన్నారు. చట్టం పైన ఉద్యోగులందరికీ పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో నార్త్ మండల  గిర్ధావర్ ప్రభాకర్, శామ్యూల్, సీనియర్ సహాయకులు శ్రీలత, సెక్షన్ సహాయకులు శ్రీ లేఖ,సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article