24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆర్ వోబికి నిధులివ్వాలని సీఎంకు బీజేపీ ఎమ్మెల్యేల వినతి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యేలు ధన్ పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ ఆధ్వర్యంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. నిజామాబాద్ జిల్లాలో అడవిమామిడిపల్లి, మాదవనగర్, అర్సపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కోరారు. రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ గా ప్రారంభించిన ఆర్ వోబిల కోసం రైల్వేశాఖ నిధులను విడుదల చేసిందని రాష్ట్ర ప్రభుత్వం నిధులను ఇవ్వకపోవడం వలన పెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు. పనుల ఆలస్యం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సీఎంను కలిసిన వారిలో బీజేపీ ప్రధాన కార్యదర్శి స్రవంతిరెడ్డి ఉన్నారు.

More articles

Latest article