హైదరాబాద్, బతుకమ్మ : నగరంలోని ఫిల్మ్ నగర్ పీఎస్ పరిధిలో ఓ ఇంట్లో 43 తులాల బంగారం, రూ.లక్ష నగదును దుండుగులు చోరీ చేశారు. ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓయూ కాలనీలో నివసిస్తున్న స్వప్న గత నెల 27న అత్తవారింటికి వెళ్లి ఈనెల 5న తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చి చూసే సరికి బంగారం, నగదు చోరీ అయినట్లు గుర్తించి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
