27.3 C
Hyderabad
Friday, July 31, 2026

ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, భిక్కనూరు: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి సబ్ స్టేషన్ దగ్గర సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బిబిపేట్ మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన గోర్కంటి స్వామి (26) అతనికి నాలుగు సంవత్సరాల క్రితం మల్లు పల్లి గ్రామానికి చెందిన శిరీషతో వివాహం అయింది. ఒక సంవత్సరం క్రితం స్వామి అతని భార్యకు శిరీష కు మధ్య గొడవ అయి ఆమె వాళ్ళ అమ్మగారి ఇంటి వెళ్ళింది. ఒక సంవత్సరం నుండి వీరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా దావఖాణకు తరలించడం జరిగిందన్నారు.

More articles

Latest article