27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

సమిష్టి కృషితో అభివృద్ధి

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: మహిళ సహకార సంఘాల అభివృద్ధికి సమిష్టి కృషితోనే సాధ్యమని ప్రతి ఒక్కరూ తమవంతుగా కృషి చేయాలని మోర్తాడ్ ఏపిఎం శ్యామ్ అన్నారు. మోర్తాడ్ మండలంలోని డోనకల్ గ్రామంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకాన్ని గ్రామంలో ఉన్న మహిళలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అలాగే అవసరం ఉన్న మహిళలకు సహకార సంఘాల ద్వారా రుణాలు ఇప్పించాలని రుణాలు తీసుకున్నవారి నుంచి సకాలంలో రుణాలు వసూలు చేయాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సిసి గాజుల శ్రీనివాస్, వివో లు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article