- బీజేపీ మండల ప్రెసిడెంట్ అరే రవీందర్
భీమ్ గల్, బతుకమ్మ : రానున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థులందరిని గెలిపించుకొని స్థానిక ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మ్రోగించాలని బీజేపీ మండల ప్రెసిడెంట్ అరే రవీందర్ అన్నారు. ఆదివారం మండలంలోని దేవక్కపేట ఎంపిటిసి పరిధి గ్రామాల ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించి ఆయన నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు. జడ్పిటీసీ, ఎంపిటీసీ, సర్పంచ్ లుగా మంచి వ్యక్తులను బలపర్చి గెల్పించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ స్థానిక ఎన్నికలను పార్టీ ప్రతి కార్యకర్త తమ బాధ్యతగా తీసుకొని పని చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నాగార్జున రెడ్డి, మండల ఉపాధ్యక్షులు భుఖ్య మోహన్, ఎస్టి మోర్చా అధ్యక్షులు లింబాద్రి నాయక్, దేవిశెట్టి శ్రీనివాస్, తిరుపతి నాయక్ గంగాధర్ దేవేందర్ లింగయ్య రవి కార్యకర్తలు నాయకులు బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు.
