26.3 C
Hyderabad
Monday, August 3, 2026

భగవద్గీతను తప్పక అందరు చదవాలి

Must read

📰 Generate e-Paper Clip

  • శ్రీ శ్రీ శ్రీధరానంద భారతీ, పూనీతనంద స్వాములు

 

ఆర్మూర్, బతుకమ్మ : భక్తి, జ్ఞాన, వైరాగ్యాల సంపుటి, హైందవ ధర్మ గ్రంధం భగవత్గీతను ప్రతి ఒక్కరు విధిగా చదవాలని శ్రీధరానంద భారతీ, పూనీతనంద స్వామిజీలు తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని అంకాపూర్ వైదిక ధ్యాన యోగా కేంద్రంలో 9వ రోజు అభయరక్షా మహా యజ్ఞాన్ని అత్యంత ఆనందోత్సాహాలతో, భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్వామీజీలు మాట్లాడుతూ వైదికాచరణల పట్ల మక్కువ కలిగి సత్సంగాలు వింటూ సద్గురువులను ఆశ్రయిస్తూ ధర్మాచరణను అనుసరించాలన్నారు. ప్రతి ఇంట్లో భగవద్గీతను ఉంచుకోవాలని,  క్రమం తప్పకుండా లేదా వీలైనప్పుడల్లా ఒక గంట సమయాన్ని కేటాయించి భగవద్గీత గ్రంథ పఠనం చేయాలన్నారు. భగవద్గీతను చదివితే నిజజీవితంలో అన్ని రంగాల్లో రాణించవచ్చునన్నారు. ఈ అభయ రక్షా మహా యజ్ఞంలో  మార నడ్పి రాజన్న, లక్కారం లావణ్య రాజేందర్, మాచర్ల వేదశ్రీ, మట్ట వసంత లక్ష్మి గంగాధర్, సామ సాయమ్మ, లక్ష్మి, మంగళారపు పుష్ప, గుండు నరేష్, కొలిప్యాక రాజమణి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article