- బీజేపీ పార్టీ మండల్ ప్రెసిడెంట్ అరే రవీందర్
భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని మెండోరా గ్రామం నుండే బీజేపీ స్థానిక ఎన్నికల శంఖ రావం మరోగించినట్లు మండల బీజేపీ ప్రెసిడెంట్ అరే రవీందర్ తెలిపారు. ఇందులో భాగంగానే మంగళవారం మెండోరా లో స్థానిక ఎన్నికల నిర్వహణ పై సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ,సర్పంచ్ స్థానాలను గెలిపించుకోవాలని అందుకు కార్యకర్తలు,నాయకులు సైనికులు లెక్క పనిచేయాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మెండోరా,దేవనపల్లి, జిల్లా నాయకులు నాగార్జున్ రెడ్డి, కిసాన్ మోర్చా మండల ఉపాధ్యక్షులు తక్కురి అంజయ్య,గాడి వేణు, తక్కురి రాము,వాల్గోట్ బాబురావు పార్వతి శ్రీనివాస్,ఎస్టీ సెల్ మండల ఉపాధ్యక్షులు రామావత్ వెంకటేష్,కరిపే ప్రదీప్, శ్రీకాంత్,నాగరాజ్,గంగాధర్,శక్తి కేంద్ర ఇన్చార్జి బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు.
