24.7 C
Hyderabad
Monday, August 3, 2026

దుర్గామాత సన్నిధిలో అన్నదానం

Must read

📰 Generate e-Paper Clip

  • పూజలు నిర్వహించిన మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి

 

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామంలో మంగళవారం శరన్నవరాత్రులను పురస్కరించుకొని శ్రీ దుర్గామాత  వద్ద అన్న సత్రం నిర్వహించారు. అన్న సత్ర కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి గౌరారం గ్రామ మాజీ సర్పంచ్ ఇమ్మడి లక్ష్మి,హాజరై దుర్గ మాత కు పూజలు నిర్వహించారు అనంతరం తిర్మాన్ పల్లి గ్రామస్తులు మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి, గౌరారం గ్రామ మాజీ సర్పంచ్ లక్ష్మి లను శాలువలతో సన్మానించారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ దుర్గా మాత దేవిని దర్శించుకుని పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.మహా అన్నదాన కార్యక్రమంలో భాగంగా  భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.మహా అన్నదాన సత్రాన్ని విజయవంతం చేసిన భక్తులకు వివిధ గ్రామల ప్రజలకు,స్వాములకు దుర్గామాత కమిటీ తరపున కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఉమ్మడి గోపి, దర్శపు గంగాధర్, పుట్నాల శ్రీను, గొల్ల శీను, అమ్మవారి మాల వేసుకున్న స్వాములు, గౌరారం గ్రామ మాజీ సర్పంచ్ ఇమ్మడి లక్ష్మి,,గ్రామ ప్రజలు,భక్తులు,అమ్మవారి మాల భక్తులు, తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Donating food in the presence of Goddess Durga

More articles

Latest article