భగవద్గీతను తప్పక అందరు చదవాలి
శ్రీ శ్రీ శ్రీధరానంద భారతీ, పూనీతనంద స్వాములు ఆర్మూర్, బతుకమ్మ : భక్తి, జ్ఞాన, వైరాగ్యాల సంపుటి, హైందవ ధర్మ గ్రంధం భగవత్గీతను ప్రతి ఒక్కరు విధిగా చదవాలని శ్రీధరానంద భారతీ, పూనీతనంద స్వామిజీలు తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని అంకాపూర్ వైదిక ధ్యాన యోగా కేంద్రంలో 9వ రోజు అభయరక్షా మహా యజ్ఞాన్ని అత్యంత ఆనందోత్సాహాలతో, భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్వామీజీలు మాట్లాడుతూ వైదికాచరణల పట్ల మక్కువ కలిగి సత్సంగాలు వింటూ సద్గురువులను ఆశ్రయిస్తూ ధర్మాచరణను అనుసరించాలన్నారు....