27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

పదవి విరమణ పొందిన సిబ్బందికి వీడ్కోలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పోలీస్ శాఖలో పదవి విరమణ పొందిన సిబ్బందికి నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో ఎంతో పనివత్తిడితో విధులు నిర్వహించి ఎలాంటి రిమార్కు లేకుండాపదవి విరమణ చేయడం ఎంతో గోప్పవిషయమని అన్నారు. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పక ఉంటుందని, మీరు డిపార్టుమెంటులో చేసిన సేవలు ఎంతో ఘననీయమని తెలిపారు. పదవి విరమణ అనంతరం మీకు ఎలాంటి అవసరం వచ్చిన మీకు ఎల్లవేళల సహయపడుతామని పేర్కొన్నారు. పదవి విరమణ పొందిన సిబ్బందికి శాలువలతో సత్కరించి సర్టిఫికేటు(జ్ఞాపికలతో) ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) బస్వారెడ్డి, ట్రాఫిక్ ఎ.సి.పి మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, టౌన్ 1 ఎస్.హెచ్.ఓ రఘువీర్, రూరల్ ఎస్.ఐ ఎమ్.డి. ఆరీఫ్, రిజర్వు ఇన్స్పెక్టర్ తిరుపతి, వారికుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article