27.3 C
Hyderabad
Friday, July 31, 2026

చండీయాగంలో జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన దుర్గాపరమేశ్వరి మాత మందిరంలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం మహాచండీయాగం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్  వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్) జి. బస్వా రెడ్డి, అదనపు డీసీపీ (ఏఆర్)  రామచంద్రరావు, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) అంకిత్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిరణ్ కుమార్, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వీయ, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహన్తో, డిఎం అండ్ హెచ్ ఓ రాజశ్రీ, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్ ఏసీపీలు, సీఐలు ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article