పేకాట రాయుళ్ల అరెస్ట్

0 14,551

మాక్లూర్, బతుకమ్మ : మండలంలోని కొత్తపల్లి గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడి చేసినట్లు మాక్లూర్ ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడి చేసి ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి రూ.4620నగదు, 5సెల్ ఫోన్లు, 4 ద్వి చక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.