29 C
Hyderabad
Monday, August 3, 2026

గంగస్తాన్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

  • పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత

 

నిజామాబాద్ సిటి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మూడో డివిజన్ గంగస్థాన్ లో గల ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన గంగస్థాన్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బతుకమ్మ పండుగ అనేది మహిళలు జరుపుకునే పెద్ద పండుగని ప్రకృతిలో లభించే పూలను పూజించే పండుగ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ లేదని అది తెలంగాణ ప్రత్యేక పండగానే తెలంగాణ సాంప్రదాయాలకు సాంస్కృతికి బతుకమ్మ ఒక ఉదాహరణని అన్నారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు తెలంగాణ సాంప్రదాయ పండుగైన బతుకమ్మను ఎంతో గొప్పగా జరుపుకుంటున్నారని, మహిళా మణులు ఎంతో సంతోషంగా సహజసిద్ధమైన రకరకాల రంగురంగుల పువ్వులతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ పండుగ ను ఘనంగా జరుపుకున్నారని తెలిపారు. బతుకమ్మ పాటలను ఆలపిస్తూ బతుకమ్మ ఆటను ఆడారు.

Bathukamma celebrations under the auspices of Gangastan Munnur Kapu Sangam

More articles

Latest article