గంగస్తాన్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు
పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత నిజామాబాద్ సిటి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మూడో డివిజన్ గంగస్థాన్ లో గల ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన గంగస్థాన్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బతుకమ్మ పండుగ అనేది మహిళలు జరుపుకునే పెద్ద పండుగని ప్రకృతిలో లభించే పూలను పూజించే పండుగ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ లేదని అది...