27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందాల్వాయి మండల కేంద్రంలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన సున్నం నరేష్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందారు. విషయం తెలుసుకున్న నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ స్పందించి  సున్నం నరేష్ కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ కింద 60 వేల రూపాయల మంజూరు చేయించారు.పార్లమెంటు సభ్యులు  ధర్మపురి అరవింద్,జిల్లా అధ్యక్షులు,నిజామాబాద్ రూరల్ ఇన్చార్జి కులచారి దినేష్ కుమార్ ఆదేశాలతో శుక్రవారం బాధిత కుటుంబానికి 60,000 సీఎంఆర్ఎఫ్ చెక్కును పార్టీ మండల అధ్యక్షులు నూలం సత్యనారాయణ అందజేశారు. అనంతరం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు లోలం సత్యనారాయణ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అంటేనే కార్యకర్తలను,పేద కుటుంబాలను ఆదుకోవడమే తమ పార్టీ లక్ష్యమని అన్నారు. బడుగు, బలహీన వర్గాలను,పేదలను ఆదుకోవడంలో భారతీయ జనతా పార్టీ ముందుంటుందన్నారు. భారతీయ జనతా పార్టీని నమ్ముకొని పనిచేసిన కార్యకర్తలను కనురెప్పల్లో కాపాడుకుంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు  లోలం సత్యనారాయణ, గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article