27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

కోతుల బెడదలతో బెంబేలెత్తుతున్న జనం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని బస్వాపూర్ గ్రామంలో కోతులు విపరీతమైన గుంపులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి బెంబేలెత్తిస్తున్నాయి. బస్వాపూర్ నుండి హరిజనవాడకు వెళ్లే దారిలో రోజువారి పనుల్లోకి వెళ్లాలంటే భయంగా వెళ్తున్నారు కోతులు పెద్దవారిని, పిల్లలను, వృద్ధులపై దాడి చేస్తూ గాయపరుస్తున్నాయి. చివరికి ఇండ్లలోకి చొరబడి అన్నం బాగోనాలు కూడా తీసుకుపోతున్నాయి. అడ్డుకపోయినా వారి మీద దాడులు చేస్తున్నాయి. సంబంధిత అధికారులు ,గ్రామ సెక్రెటరీ జోక్యం చేసుకొని కోతుల బెడద నుండి కాపాడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

More articles

Latest article