వెబ్ న్యూస్, బతుకమ్మ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో జెరూసలేం మత్తయ్యకు ఊరట లభించింది. ఈ కేసులో మత్తయ్యను తప్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. 2017లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై సెప్టెంబర్ 22వ తేదీన వాదనలు ముగించిన జస్టిస్ సీజేఐ గవాయ్ ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. ఓటుకు నోటు కేసులో మత్తయ్య ఏ4గా ఉన్నారు. 2015లో తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఈకేసు తెరపైకి వచ్చింది. అప్పటి టీడీపీ నాయకులు ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్)ను తమ అభ్యర్థికి ఓటు వేయడానికి డబ్బు ఆశ చూపారని ఆరోపణలు ఉన్నాయి.
