29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

న్యాయమూర్థుల, న్యాయవాదుల బతుకమ్మ ఆటపాట

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ వైతాళికులు, ప్రజల మనిషి కాళోజి నారాయణ రావు పలికిన నిత్యజీవిత పలుకుల్లో “బతుకమ్మ బతుకు ” అనే పదానికి విశ్రుత అర్థం ఉన్నదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. వి. ఎన్ భారత లక్ష్మీ తెలిపారు. జిల్లాకోర్టు ప్రాంగణంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్, జిల్లా జ్యూడిషియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన ‘బతుకమ్మ పండుగ ‘ఉత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఆటపాటలతో ఆలరించారు. రంగురంగుల పూలతో ఇంద్రధనుస్సుల పేర్చి ప్రకృతికి సేకరించి,తిరిగి ప్రకృతికి అర్పించే తెలంగాణ ప్రజల సంస్కృతిక పండుగ అని ఆమె అభివర్ణించారు. బతుకమ్మ అందమైన బతుకును నేర్పిందని, ప్రజలను ఒక దగ్గరకు చేర్చి సమానతను చాటిందని అన్నారు. దేవి నవరాత్రులకు ఒక రోజు ముందు బొడ్డెమ్మతో మొదలై బతుకమ్మతో ముగించే ఘనమైన అధ్యాత్మిక వారసత్వ పండుగగా జనజీవనంలో కలిసిపోయిందని ఆమె పేర్కొన్నారు. అందరు బతకాలి ఆనందంగా బతకాలి,అవనిపై పూలన్నీ వికసించినట్లు, ప్రజా సమూహల్లోని ప్రజల జీవనవిధానంలో రంగురంగుల హరివిల్లులు విరియాలని జిల్లాజడ్జి భారత్ లక్ష్మీ అకాక్షించారు. బతుకమ్మ ఆటపాటలో సీనియర్ సివిల్ జడ్జి సాయిసుధ, ఉదయ్ భాస్కర్ రావు,జూనియర్ సివిల్ జడ్జిలు కుష్భు ఉపాధ్యాయ,గోపికృష్ణ, శ్రీనివాస్ రావు, బార్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు, న్యాయవాదులు పరిపూర్ణ, కవిత,జ్యూడిషియల్ నాయకురాల్లు సుజాత, వెంకట లక్ష్మీ,అనిత తదితరులు పాల్గొన్నారు.

Bathukamma dance of judges and lawyers

More articles

Latest article