27.1 C
Hyderabad

మైనర్ బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తి

Must read

📰 Generate e-Paper Clip

  • కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని రెండవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓవ్యక్తి 11 సంవత్సరాల మైనర్ బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించాడని పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో నివసించే అన్వర్ అనే వ్యక్తి మైనర్ బాలిక కుటుంబ సభ్యులు ఇంటిలో లేనప్పుడు అనుచితంగా ప్రవర్తించాడు. బాలిక తల్లిదండ్రులకు తెలుపవడంతో వారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గురువారం రాత్రి అన్వర్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More articles

Latest article