న్యాయమూర్థుల, న్యాయవాదుల బతుకమ్మ ఆటపాట

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ వైతాళికులు, ప్రజల మనిషి కాళోజి నారాయణ రావు పలికిన నిత్యజీవిత పలుకుల్లో "బతుకమ్మ బతుకు " అనే పదానికి విశ్రుత అర్థం ఉన్నదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. వి. ఎన్ భారత లక్ష్మీ తెలిపారు. జిల్లాకోర్టు ప్రాంగణంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్, జిల్లా జ్యూడిషియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన 'బతుకమ్మ పండుగ 'ఉత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఆటపాటలతో ఆలరించారు. రంగురంగుల పూలతో ఇంద్రధనుస్సుల పేర్చి ప్రకృతికి సేకరించి,తిరిగి ప్రకృతికి అర్పించే తెలంగాణ ప్రజల సంస్కృతిక...