బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆస్పత్వార్ అశోక్ సెట్ కు ఉత్తమ రైతు అవార్డు సన్మాన మహోత్సవం జరిగింది.బోధన్ లో లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఉత్తమ రైతు సన్మాన సభ ను నిర్వహించారు. ఈ సభలో ఉత్తమ ఆదర్శ రైతుగా బిచ్కుంద గ్రామానికి చెందిన ఆస్పత్వార్ అశోక్ సెట్ అవార్డును అందుకున్నారు. అవార్డు తో పాటు ప్రశంసా పత్రం అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆదర్శ రైతు మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో విశేష కృషి చేసి ఆధునిక ,సేంద్రియ పద్ధతులను అవలంబించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని సాధించినందుకు ఈ సత్కారాన్ని ఆయనకు అందించినట్లు ఆయన తెలిపారు. సేంద్రియ పద్ధతిలో పంటలను సాగు చేయాలని తద్వారా ఎక్కువ దిగుబడిని సాధించవచ్చు అని ఆయన రైతులకు సూచించారు.

