27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రశాంత వాతావరణంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

జుక్కల్, బతుకమ్మ : అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర అన్నారు. వర్షాలు పడుతున్నందున మండపాలల్లో ఏర్పాటు చేసే విద్యుత్ దీపాల విషయంలో   జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.  జుక్కల్  మండలంలో దుర్గామాత  మండపాలు ఏర్పాటు చేసే  ఆర్గనైజర్ లకు, మండపాల నిర్వాహకులకు, కార్యవర్గ సభ్యులకు,దుర్గామాత ప్రతిష్టచాలనుకునే వారు సంభందింత పియస్ నుండి  అనుమతి తీసుకోవాలి. ఎలక్ట్రిసిటి డిపార్ట్మెంట్  అనుమతి తీసుకోవాలి, దుర్గామాత మండపం రోడ్డు ప్రక్కన గాని ఖాళీ స్థలంలో గాని నిర్మించాలి. విగ్రహం యొక్క స్టేజి కింద ఎలాంటి వస్తువులు ఉంచరాదు  మండపాల వద్ద తగినంత సంఖ్యలో  సత్ప్రవర్తన కలిగిన వాలంటీర్లను ఉండాలి, అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను క్రమబద్ధీకరించే విధంగా చూడవలెను. దుర్గామాత మండపాలను మంచి నాణ్యత కలిగిన వస్తువుల తో ఏర్పాటు చేయవలెను మండపం మూడు వైపులా టార్పాలిన్ తో కప్పవలెను. మండపాలకు నాణ్యత కలిగిన వైరుతో కరెంట్ కనెక్షన్ ఇవ్వవలెను. వివాదాస్పద ప్రదేశాలలో మండపాలు ఉండకూడదు. దుర్గామాత మండపం వద్ద ముగ్గురు వాలంటీర్లు 24 x7 తప్పకుండ కాపలా ఉండాలని ఉండాలని సూచించారు. మండపాలలో అసాంఘిక కార్యకలాపాలకు తావివ్వకుండదు. మండపాల వద్ద టపాకాయలను ఇతర మందుగుండు సామాగ్రిని ఉంచరాదు. మండపం దగ్గర పూజాసమయాలలో భక్తుల వాహనాలను సరైన పద్దతిలో పార్కింగ్ చేయాలి. దుర్గామాత విగ్రహాల కమిటీ మెంబర్ల పేర్లు అడ్రసు, సెలఫోన్ నంబర్లు పోలీసు స్టేషన్ లో ఇవ్వాలి. ప్రార్ధన నమాజ్ సమయంలో లౌడ్ స్పీకర్లు వాడరాదు. విగ్రహాల దగ్గర బాక్స టైప్ స్పీకర్లను మాత్రమే వాడాలి ముందుగా పర్మిషన్ తీసుకోవాలి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉదయం 0600 గం: ల నుండి రాత్రి 10:00 గం లవరకు స్పీకర్లను మాత్రమే వాడాలి, స్పీకర్ సౌండ్ మోతాదులో నే ఉండాలి, ఇతరులకు ఇబ్బంది కలుగకుండా చూడాలి, భక్తికి సంబంధించిన పాటలు మాత్రమే వేయాలి.లౌడ్ స్పీకర్లు విద్యాలయాలకు, ఆసుపత్రులకు, ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలకు ప్రార్థన మందిరాలకు, ఇబ్బంది కలిగే విధంగా ఉండరాదు. దుర్గామాత మండపము నాణ్యమైన వస్తువులతో ఏర్పాటు చేయాలి మరియు చుట్టూ బ్యారికేటీంగ్ కట్టాలి. మండపాల వద్ద వాటర్ డ్రమ్ము మరియు ఇసుక తప్పకుండా ఉంచవలెను. మద్యం సేవించకూడదు. మద్యం సేవించి మండపాల వైపు రాకూడదు,. మహిళల పట్ల మర్యాదపూర్వకంగా మెలగాలి. మండపాలలో మరియు చుట్టూ తగినంత వెలుతురు ఉండేలా చూడాలి, విద్యుత్ పోయిన సమయాల్లో టార్చ్ లైట్లు లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు విధిగా ఏర్పాటు చేసుకోవాలి. రెచ్చగొట్టే పొస్టర్లు గాని, బ్యానర్లు గాని, కరపత్రాలను గాని పంచకూడదు, అంటించకూడదు.మండపాల వద్ద కొత్త వ్యక్తులు సంచరించినచో మరియు ఎలాంటి సమాచారమైన పోలీసు వారికి విధిగా తెలియపరచాలి. సోషల్ మీడియాలో వచ్చే అనవసర వదంతులను, పుకార్లునమ్మరాదు.విగ్రహ ప్రతిష్ట నుండి మొదలుకొని నిమజ్జనం వరకు సంబంధిత ఆర్గనైజర్స్ పూర్తి భద్యత వహించవలెను. పెద్దలు నిర్ణయించిన తేదీ లోపల నిమజ్జనం పూర్తి చేయాలి.  విగ్రహాలు ఏర్పాటు చేసిన వారు మండపాల వద్ద విధిగా ఒకటి లేదా రెండు సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.  ఎటువంటి చిన్న సమాచారం ఉన్నా మీ దగ్గరలోని పోలీసులకు తెలుపండి లేదా నెంబర 8712686178 ఫోన్ చేసి తెలుపగలరు. ప్రతి దుర్గామాత మండపాల దగ్గర విధిగా పాయింట్ పుస్తకం ఏర్పాటు చేసుకోవాలి పోలీసు అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు అందులో రాసి సంతకం చేస్తారు. దుర్గామాత మండపాలు యొక్క పూర్తి వివరాలు నిమజ్జనం కొరకు ఏ రోజు ఎక్కడికి ఏ మార్గం ద్వారా తీసుకున్నారని సమాచారం సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ముందుగానే తెలుపండి. ప్రజల సౌకర్యం కొరకు పోలీసు నిఘా ఏర్పాటు చేయడం జరిగినది నిర్వాహకులు మరియు ప్రజలు పోలీస్ వారి సలహాలు సూచనలు పాటిస్తూ ప్రశాంతంగా దుర్గామాత పండుగ మరియు నిమజ్జనం జరుపుకోవాలని సూచించారు. పోలీసు వారి సలహాలు సూచనలు పాటించి ప్రశాంతమైన వాతావరణంలో, ఆనందోత్సవాల మధ్య దుర్గమాత ఉత్సవాలు జరుపుకొని, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.దుర్గామాత విగ్రహల భద్రతకై ప్రత్యేక చర్యలు తీసుకోవడం పాటు, పోలీస్‌ స్టేషన్ల వారిగా నెలకోల్పబడిన విగ్రహల సమాచారంను సులభంగాగుర్తించేందుకుగాను పోలీస్‌ స్టేషన్లగా  ఎర్పాటు చేసిన వినాయక విగ్రహాలకు సంబంధించిన పూర్తి సమాచారన్ని తెలుసుకోవడం కోసం దుర్గామాత విగ్రహాలను జీయోట్యాగింగ్‌ ద్వారా గూగుల్‌ మ్యాప్‌లకు అనుసంధానం చేయడం జరుగుతోంది. విగ్రహాలను జీయో ట్యాగింగ్‌ చేసేందుకు గాను పోలీస్‌ అధికారులు తమ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఎర్పాటు చేసిన విగ్రహాల వద్దకు పెట్రోలింగ్‌ పోలీస్‌ సిబ్బంది వెళ్ళి విగ్రహాలను నేలకోల్పబడిన  ప్రదేశం, ఏర్పాటు చేసిన వ్యక్తుల సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు వారి సెల్‌ఫోన్‌ నెంబర్లతో కూడిన పూర్తి సమాచారాన్ని సేకరించిన విగ్రహం ఏర్పాటు చేసిన ప్రదేశం నుండే పోలీస్‌ సిబ్బంది వద్ద వున్న ట్యాబ్‌లో జీయోట్యాగింగ్‌ చేయడం జరుగుతుంది.

More articles

Latest article