26.6 C
Hyderabad
Monday, August 3, 2026

జీఎస్టీ సవరణలు దేశ ప్రజలకు ప్రధాని మోడీ దసరా కానుక

Must read

📰 Generate e-Paper Clip

  • ఎంపీ ధర్మపురి అరవింద్

 

నిజామాబాద్, బతుకమ్మ : దేశంలో ప్రజలకు జీఎస్టీ సవరణల అమలు ప్రజలకు ప్రధాని మోడీ దసరా కానుక అని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎంపి అరవింద్ విలేఖరులతో మాట్లాడుతూ.. జీఎస్టీ సవరణలతో అన్ని వర్గాలకు ఊరట అని అన్నారు. 5శాతం జీఎస్టీ ఉన్న వస్తువుల పన్నులను పూర్తిగా ఎత్తేశారు అని తెలిపారు. 18 శాతం ఉన్న పన్నులను 5 శాతానికి తగ్గించారు అని పేర్కొన్నారు. జీఎస్టీ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ కూడా ఉన్నారని కాంగ్రెస్ నాయకులు గుర్తించాలని తెలిపారు. జీఎస్టీ సవరణల ద్వార కేంద్రం పై కూడా 2లక్షల కోట్ల భారం పడుతోంది అయిన ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్నామన్నారు. జీఎస్టీల సడలింపుల ద్వార బీజేపీ కి పాపులారిటీ వస్తుందనే కాంగ్రెస్ ఏడుపులు అని ఎంపి అరవింద్ ఎద్దేవా చేశారు. ఆలమట్టి ఎత్తు పెంపు పై తెలంగాణ, కర్ణాటక సీఎం లు మాట్లాడుకోవాలి అని సలహా ఇచ్చారు. స్థానిక ఎన్నికల కోసం సిద్ధంగా ఉన్నాం అని తెలిపారు. అన్ని సీట్లు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేస్తాం అని ఎంపి అరవింద్ జ్యోస్యం చెప్పారు. ఈ విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ, జిల్లా అధ్యక్షులు కులచారీ  దినేష్, జాతీయ పసుపు బోర్డు చైర్మెన్ పల్లె గంగారెడ్డి, నాయకులు స్రవంతిరెడ్డి, న్యాలం రాజు, లక్ష్మినారాయణ, దిశ కమిటీల సభ్యులు హన్మంతరావు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

GST amendments are Prime Minister Modi's Dussehra gift to the people of the country

  • జీఎస్టీ అమలు తీరును పరిశీలించిన ఎంపీ అర్వింద్..

దేశంలో ఈ నెల 23నుంచి అమలులోకి వచ్చిన జిఎస్టీ సవరణలను నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ పరిశీలించారు. నగరంలోని పంచవటి మెగా మార్ట్, బజాజ్ ఎలాక్ట్రానిక్స్, హోండా షోరూంలలో జీఎస్టీ తగ్గింది.. మీ ఖర్చు కూడా తగ్గుతుంది అనే పోస్టర్ లను అతికించారు. ఈ సంధర్బంగా జిఎస్టీ తగ్గింపుల తరువాత వస్తువుల ధరలను అడిగి తెలుసుకున్నారు. గతంలో ఉన్న జీఎస్టీ ధరలు, ప్రస్తుతం జీఎస్టీ తగ్గిన తరువాత ధరలను వినియోగదారులను అడిగి తెలుసుకున్నారు.

GST amendments are Prime Minister Modi's Dussehra gift to the people of the country

More articles

Latest article