29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

అవినీతి నిరూపిస్తే దేనికైనా సిద్ధం

Must read

📰 Generate e-Paper Clip

  • రాజకీయ లబ్ధికోసమే అవినీతి ఆరోపణలు
  • మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్

 

బతుకమ్మ, కోటగిరి : తమ రాజకీయ లబ్ధికోసమే లేనిపోని ఆరోపణలు చేస్తూ రాజకీయపబ్బం గడుపుతున్నారని కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్ అన్నారు. కోటగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. సోమవారం  బిఆర్ఎస్, బీజేపీ, సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో  డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లబ్ధిదారులే లేకుండా డబుల్ బెడ్ రూమ్  ఇండ్ల లబ్ధిదారులకు మద్దతుగా  ధర్నా నిర్వహించడం సిగ్గుచేటు అని అన్నారు. గడిచిన ఐదు సంవత్సరాలలో కోటగిరి గ్రామంలో సుమారు 430 డబుల్ బెడ్ రూమ్ ల ఇండ్లు  ఇవ్వడం జరిగిందని స్వంత స్థలాలలో ఇంటి నిర్మాణం చేసుకున్న లబ్ధిదారులకు కాంట్రాక్టర్ ద్వారా బిల్లులను విడత వారీగా లబ్ధిదారులకు స్థానిక నాయకులు అందించడం జరిగిందని ఆయన అన్నారు.కానీ కొందరు కావాలనే  లబ్ధిదారులకు రావలసిన డబ్బులలో కాంట్రాక్టర్, స్థానిక నాయకులు, హౌసింగ్ ఏ ఈ లు చేతివాటం ప్రదర్శించారంటూ ఆరోపణ చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. లబ్ధిదారులకు చివరి బిల్లు రావాలంటే తప్పనిసరిగా క్వాలిటీ సర్టిఫికెట్ను  సమర్పించిన తర్వాతే బిల్లులు వస్తాయని  ఆయన అన్నారు. ప్రభుత్వాలు మారడం వల్ల బిల్లులో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని  లబ్ధిదారులకు పెండింగ్  బిల్లులు ఇప్పించడం కోసం స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అహర్నిశలు కష్టపడుతున్నారని  కావాలని కొందరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా అవినీతి ఆరోపణలు జరిగాయని నిరూపిస్తే బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సింగల్ విండో చైర్మన్ కూచసిద్దు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీధర్, హోగీర్రావు పటేల్, బీర్కూర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article