బతుకమ్మ నిజామాబాద్ సిటీ : అక్టోబర్ 24 న ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే పి.డి.ఎస్.యూ అర్ధ శతాబ్ద సభను విజయవంతం చేయాలని పి.డి ఎస్.యూ నాయకులు రవీందర్ , దేవిక లు విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు. పి.డి.ఎస్.యూ అర్థ శతాబ్ద సభ పోస్టర్స్ ను నిజామాబాద్ నగరంలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పి.డి ఎస్.యూ నాయకులు మాట్లాడుతూ 1974 లో పి.డి.ఎస్.యూ ఏర్పడిందని ,
గత 50 ఏండ్ల కాలంలో విద్య రంగ సమస్యలపైన , శాస్త్రీయ విద్యా సాధనకై , సమ సమాజ స్థాపనకై ,నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం , విద్య ప్రైవేటీకరణ కార్పొరేటికరణ కు వ్యతిరేకంగా పి.డి.ఎస్.యూ విద్యార్థి సంఘం పోరాడుతూ వస్తుందని , విద్యార్థి ఉద్యమంలో జార్జ్ రెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ,రంగవల్లి లాంటి వారు ఎందరో విద్యార్థి రత్నాలు బిగిపిడికిలి జెండా కోసం తమ ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించరని అన్నారు. వారి పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని , అక్టోబర్ 24 న జరిగే పి.డి.ఎస్.యూ శతాబ్దోత్సవ సభను వేల సంఖ్యలో విద్యార్థులు హాజరై విజయవంతం చేయాలని అన్నారు. కార్యక్రమంలో పి.డి.ఎస్.యూ నాయకులు రాకేష్, పాండు ,నిరాజ్,రాము,సాయి,మహేష్,వికాస్, శివ తదితరులు పాల్గొన్నారు.
పీడీఎస్యూ అర్ధశతాబ్ద సభను విజయవంతం చేయండి
