27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

జీఎస్ టీ తగ్గింపు కారణంగా దేశంలోని ప్రజలకు ఎంతో ఊరట

Must read

📰 Generate e-Paper Clip

 

వెల్పూర్ బీజేపీ ప్రెసిడెంట్ బేల్దారి నవీన్

వేల్పూర్, బతుకమ్మ

కేంద్రంలో మోడీ ప్రభుత్వం తీసుకొన్న సంచాలనాత్మక నిర్ణయం జీఎస్ టీ తగ్గింపు కారణంగా దేశంలోని పేద, సామాన్య,మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఊరటనిస్తోందని మండల బీజేపీ ప్రెసిడెంట్ బేల్దారి నవీన్ అన్నారు. తగ్గించిన జీయస్ టీ 2.0 నేటి నుండి అమలు చేస్తున్నామని కేంద్రం ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించిన నేపథ్యం ఆయన ఆదివారం మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంలో కానిస్టెన్సీ కన్వీనర్ మల్కాన్నగారి మోహన్ తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా నవీన్ మాట్లాడుతూ ఈ జీయస్ టీ తగ్గింపు వల్ల రైతులకు పెట్టుబడి భారం తగ్గనుందన్నారు. దీని వల్ల రైతులకు ఎరువులు, డ్రిప్పు, వ్యవసాయ యంత్ర పరికరాలపై 0% వడ్డీతో లభించనున్నాయని అన్నారు. వీటితో పాటు పాల ఉత్పత్తులు, నిత్యావసర సరకులు, వైద్య పరికరాలు, ఔషాదాలు, స్టేషనరీ లతో పాటు నిర్మాణం రంగంలో మంచి ధర తగ్గుదల వస్తుందన్నారు. ఈ నిర్ణయం వల్ల పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజల వద్ద డబ్బులు ఆదా అయ్యి ఆర్ధిక వ్యవస్థ బాలబడుతుందని ఆయన ఆశభావం వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానం ఉండాలని ప్రధాని మోడీజీ తీసుకొన్న నిర్ణయం పన్ను వ్యవస్థ పారదర్శకంగా,సులభతరం మారుతుందన్నారు.ఈ ప్రెస్ మీట్ బీజేపీ జిల్లా కార్యదర్శి నోముల నర్సారెడ్డి, మండల నాయకులు రమేష్, జాగిరపు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article