నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సీనియర్ న్యాయవాది దయాకర్ గౌడ్ నియమితులయ్యారు. నిజామాబాద్ నగరానికి చెందిన రంగు దయాకర్ గౌడ్ సీనియర్ న్యాయవాదిగా కాంగ్రెస్ లీగల్ సెల్ లొ వివిధ హోదాలలో పనిచేశారు. రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ సెల్ కో కన్వీనర్ గాను పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాద జేఏసీ తరఫున పోరాటం చేశారు. దయాకర్ గౌడ్ రావుజీ సంఘం ఉన్నత పాఠశాల1991 లొ ఎస్ఎస్సి పూర్తి చేశారు. నిజామాబాద్ నగరంలోని సిఎస్ఐ జూనియర్ కళాశాలలో
ఇంటర్ ను 1991- 1993 కంప్లీట్ చేశారు. డిగ్రీ బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల( మధు మాలాంచ) లో 1993-96 చదివారు. ఎల్ ఎల్ బి ని నిజామాబాద్ లా కళాశాల నిజామాబాద్ 1997-2001 పూర్తి చేశారు. బార్ కౌన్సిల్ లో ఎన్రోల్ మెంట్ చేసుకొని నిజామాబాద్ కోర్టులో జూనియర్ న్యాయవాదిగా బండారి కృష్ణా నందు దగ్గర పనిచేశారు. జర్నలిస్ట్ గా పలు తెలుగు జాతీయ పత్రికలలో లీగల్ రిపోర్టర్గా పనిచేశారు. నిజామాబాద్ జిల్లా కోర్టులో దాదాపు రెండు దశాబ్దాలుగా న్యాయవాది గా పనిచేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఎదగడం జరిగింది.

- అగ్ర నేతలకు ధన్యవాదాలు : పి పి రంగు దయాకర్ గౌడ్
నిజామాబాద్ జిల్లా ఎస్సీ ఎస్టీ కోడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించినందుకు రాష్ట్ర పీసీసీ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, రోలు ఎమ్మెల్యే భూపతిరెడ్డి లకు కృతజ్ఞతలు. జిల్లాలో ఎస్సీ ఎస్టీ కేసుల బాధితుల పక్షాన వాదించి వారికి న్యాయం చేసేలా కృషి చేస్తా.

