27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

స్వస్ట్ వారి శక్తి పరివార్ అభియాన్ కు అపూర్వ స్పందన

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : స్వస్ట్ వారి శక్తి పరివార్ అభియాన్ ప్రోగ్రాంకు అపురూప స్పందన వస్తుందని దేవునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జోహముజీబ్ తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ జోహ కంటి వైద్యాధికారి డాక్టర్ కిషన్ రావు ఆధ్వర్యంలో స్వస్ట్ వారి శక్తి పరివార్ అభియాన్ ప్రోగ్రాంకు అపురూప స్పందన వస్తుందని దేవునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ జోహాముజీబ్ తెలిపారు.  ఈనెల 17 తేదీ నుండి అక్టోబర్ 2 వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా మహిళలకు షుగర్ , బిపి, గర్భవతులకు ఆరోగ్య పరీక్షలు, కిశోర బాలికలకు అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగానే ఈ రోజు  కంటి వైద్య డాక్టర్ కిషన్ రావు ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. వ్యాధిగాస్తుల కొరకు టీబి, మలేరియా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని మహిళలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ ఆఫీసర్స్ నవనిత, సుమలత, ఫార్మసీ ఆఫీసర్స్ సంధ్య, దీప్తి ఏఎన్ఎంలు విమల, ఆసియా, ఆశా వర్కర్స్ పావని, మల్లేశ్వరి, లక్ష్మి ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Unprecedented response to Swast's Shakti Parivar campaign

More articles

Latest article