- సీజన్ లో 450 టీయంసీల ఇన్ ప్లో రాక
- రికార్డు స్థాయిలో కరెంట్ ఉత్పత్తి
నిజామాబాద్, బతుకమ్మ : ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు ఈ సంవత్సరం మొత్తం వరద పోటెత్తుతుంది. జూన్ 1 నుంచి గురువారం 454.109 టియంసీల ఇన్ ఫ్లో వచ్చి చేరింది. ప్రాజెక్టు నుంచి గోదావరి నదితో పాటు కాలువలకు ఇప్పటి వరకు 400.389 టియంసీల నీరు విడుదల చేశారు. ప్రాజెక్టుకు 275,000 క్యూసెక్కుల ఇన్ ప్లో గురువారం వస్తుండగా 38 గేట్లను ఎత్తి 2,38,140 క్యూసెక్కులను దిగువకు వదలుతున్నారు. కాలువలతో పాటు, ఎత్తిపోతల పథకాలకు నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టు లో1086.9 అడుగుల సామార్థ్యంతో 66.233 టియంసీల నీరు సాయంత్రానికి నిల్వ ఉంది.
శ్రీరాం సాగర్ ప్రాజెక్టులో జూన్ 1న 12.79 టియంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. జూన్ మాసంలో బాబ్లీ గేట్లు ఎత్తడం ద్వార, పై భాగంలో వర్షం ద్వార 4.485 టియంసీల వరద వచ్చి చేరింది. జూలై మాసంలో 24.488 టియంసీల ఇన్ ప్లో వచ్చింది. ఆగస్టు మాసంలో 249.617 టియంసీలు, సెప్టెంబర్ లో ఇప్పటి వరకు 175.519 టియంసీల వరద వచ్చింది. అత్యధికంగా ఈ సీజన్ లో 454.1 టియంసీల నీరు వచ్చింది. ప్రాజెక్టు నుంచి 400.4 టియంసీల నీటిని దిగువకు వదిలారు. అందులో కాకతీయ కాలువకు 14.49 టియంసీలు, సరస్వతి కాలువకు 1.481 టియంసీలు, లక్ష్మి కాలువకు 0.276 టియంసీల నీటిని విడుదల చేయగా ఆర్ సి గేట్ల ద్వారనే 321.1 టీయంసీలను గోదావరిలోకి విడుదల చేశారు అధికారులు. ఎస్కేప్ గేట్ల ద్వార 10.29 , ఆలీసాగర్ లిప్ట్ కు 0.382 టియంసీలు, గుత్పా లిప్ట్ కు 0.255 టీయంసీలు, మీషన్ భగీరథకు 2.176, వరధ కాలువల ద్వార 45.82 టియంసీలు నీటి విడుదల జరిగింది.
పోచంపాడ్ కు ఈ సీజన్ లో వరద పొంగిపోర్లడంతో నీటి విడుదల వందల టీయంసీలు కొనసాగుతోంది. అదే సమయంలో జేన్ కోలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ప్రతి నిత్యం.8593 మిలియన్ యూనిట్ ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. నాలుగు టర్బైన్ ల ద్వార గురువారం 36.12 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. నెల వారిగా 14.0433 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. సంవత్సరం మొత్తం 30.0997 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరుగుతుంది. ఈ సంవత్సరం 0.003804 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అంచనా వేస్తున్నారు.

