29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

స్వచ్ఛ భారత్ కు ప్రపంచ గుర్తింపు

Must read

📰 Generate e-Paper Clip

  • మండల బీజేపీ ప్రెసిడెంట్ అరే రవీందర్

 

భీమ్ గల్, బతుకమ్మ : దేశ ప్రధానిగా ఎన్నికైన మొదటి సంవత్సరం మోడీ భారత్ లో తీసుకొచ్చిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ప్రపంచ దేశాల్లో మంచి గుర్తింపు వచ్చిందని బీజేపీ మండల ప్రెసిడెంట్ అరే రవీందర్ అన్నారు. మోడీజీ జన్మదినాన్ని పురస్కరించుకొని బీజేపీ ఆధ్వర్యంలో మండలంలో నిర్వహిస్తున్న సేవాపక్షం కార్యక్రమం లో భాగంగా మండలంలని బాబానగర్, బాచన్ పల్లి గ్రామాల గవర్నమెంట్ పాఠశాలల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా పాఠశాలల్లో పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్బంగా రవీందర్ మాట్లాడుతు ఈ స్వచ్ఛ భారత్ వచ్చిన నుండి మోడీని ఆదర్శనంగా తీసుకొని సామాన్య మానవుని నుండి వి. ఐ. పి లు కుడా స్వచ్చందంగా ఈ కార్యక్రమం ను నిర్మొహమాటంగా నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ బృహత్తర కార్యక్రమం పుణ్యమా అని దేశ నలుమూలాల పరిశుభ్రత పెరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2 వరకు జరుగుతున్న సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా గురువారం నాడు బాబా నగర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో మరియు బాచన్ పల్లి గ్రామ ఉన్నత పాఠశాల లో జరిగినటువంటి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొని పరిసరాలను పరిశుభ్రం చేసినారు ఆయా గ్రామల బిజెపి శాఖ ఆధ్వర్యంలో జరిగినటు వంటి స్వచ్ఛభారత్ సేవా కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆరే రవీందర్ పాల్గొని పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశుభ్రత పాటింపు పెరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో ప్రతి పౌరుడు విధిగా పలు పంచుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బిర్రు రామకృష్ణ, కిసాన్ మోర్చా అధ్యక్షులు తోట గంగాధర్,బాబా నగర్ గ్రామ శాఖ అధ్యక్షులు మంద సురేష్ మండల నాయకులు కొండ గంగాధర్ గౌడ్,నాగుల భూమన్న,తోట రమేష్,కృష్ణ మరియు బాచన్ పల్లి గ్రామ శాఖ అధ్యక్షులు శెట్టి లక్ష్మణ్ బీజేవైఎం మండల అధ్యక్షులు శెట్టి ప్రేమ్చంద్,సుదర్శన్, రంజిత్ బూత్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Global recognition for Swachh Bharat

More articles

Latest article