- జిల్లాలో సైబర్ కేసులలో ప్రతిభ కనబర్చిన సైబర్ వారియర్లకు ప్రోత్సాహకాలు, ప్రశంస పత్రాలు అందజేత
- జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ:రాజన్న సిరిసిల్ల జిల్లాలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, మోసపూరిత ఆన్‌లైన్ కార్యకలాపాలను అరికట్టడం, తక్షణ చర్యల ద్వారా బాధితులకు న్యాయం చేయడం వంటి అంశాల్లో కృషి చేసినసైబర్ సెల్ ఆర్.ఎస్.ఐ జునైద్, శ్రీకాంత్ డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్,రాజశేఖర్ వేములవాడ రూరల్, వెంకటరమణ సిరిసిల్ల టౌన్ , లకు ప్రశంశ పత్రాలు, ప్రోత్సాహకాలు అందించిన జిల్లా ఎస్పీ .ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ క్రైమ్ దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం అత్యంత కీలకమని,భవిష్యత్‌లో మరింత నైపుణ్యంతో కేసులు పరిష్కరించేలా సైబర్ వారియర్లను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.సైబర్ నేరాలకు గురైన బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి పోలీస్ స్టేషన్లో నియమించబడ్డ సైబర్ వారియర్స్ సైబర్ నేరాలపై వచ్చే పిర్యాదులపై తక్షణమే స్పందించి కేసులు నమోదు చేయాలని, సైబర్ నేరగాళ్ల ద్వారా మోసపోయిన వ్యక్తులు డబ్బు బ్యాంకులో ఫ్రీజ్ అయి ఉన్నట్లయితే వీలైనంత త్వరగా డబ్బులు తిరిగి వచ్చే విధంగా కృషి చేయాలన్నారు.అనుకోని రీతిలో ఎవరైనా సైబర్ నేరానికి గురైతే ఖంగారు పడకుండా వెంటనే 1930 ఫోన్ నెంబర్ కు, ఎన్ సి ఆర్ పి పోట్రల్ గాని,దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో ఉన్న సైబర్ వారియర్ ని సంప్రదించాలని ఎస్పీ తెలిపారు. ఎస్పీ వెంట సైబర్ సెల్ ఆర్.ఎస్.ఐ జునైద్ సిబ్బంది ఉన్నారు.
