- ఎస్పీ, అదనపు డీజీపీకి నోటీసులు
నిజామాబాద్, బతుకమ్మ : కామారెడ్డి రూరల్ సీఐపై దళితుల ఫిర్యాదులు మిన్నంటుతున్నాయి. భూకబ్జాలు, అక్రమ నిర్మాణాలు, చెరువుల ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులను కామారెడ్డి రూరల్ సీఐ రామన్ నిర్లక్ష్యం చేసి, ప్రభావశీలుల పక్షాన వ్యవహరించాడని బాధితులు ఆరోపించారు. ఈ ఆరోపణలపై బాధితులు ఎస్సీ కమిషన్ ను ఆశ్రయించారు. బాధితుల పూర్వపరాలను పరిశీలించిన జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్‌గా స్పందించింది. కామారెడ్డి జిల్లా ఎస్పీతో పాటు రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీకి నోటీసులు జారీ చేసి, ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది. బాధిత దళితులు ఈ విషయాన్ని నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లారు. “దళితులపై అవమానం, హక్కుల ఉల్లంఘన జరిగినా సీఐ పై చర్యలు తీసుకోకపోవడం బాధాకరం. పోలీస్ స్టేషన్ లో మాకు గౌరవం లేకుండా ప్రవర్తించారు” అని వారు ఆరోపించారు. ఫిర్యాదులు ముఖ్యమంత్రి వరకు వెళ్లడంతో, ఇక ఎలాంటి చర్యలు తీసుకుంటారో రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు” అని స్థానికంగా చర్చ సాగుతోంది. ఈ పరిణామాలతో కామారెడ్డి జిల్లా పోలీస్ యంత్రాంగంలో కలకలం రేగింది. కామారెడ్డి జిల్లాలో పోలీస్ బాస్ చిన్న తప్పులను ఉపేక్షించాలని పేరు కలిగి ఉన్నారు. ఏకంగా జాతీయ ఎస్సీ కమిషన్ కు సీఐ పై ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు వేచి చూడాలి.
