29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

రైతులకు బస్తా యూరియా ఇప్పించలేని ఎంపీలు రాజీనామా చెయ్యాలి

Must read

📰 Generate e-Paper Clip

  • రైతులకు మళ్ళీ చెప్పులు, పాస్ బుక్ లు లైన్ లో పెట్టే దౌర్భాగ్యం దాపురించింది
  • కేసీఆర్ ముందుచూపుతో పదేళ్లలో యూరియా కొరత రాలేదు
  • అరవింద్ కు పలుకుబడి ఉంటే మోదీ దగ్గరికి వెళ్ళి యూరియా తీసుకురావాలి
  • బడే భాయ్ కి కోపం వస్తుందనా.. చోటే భాయ్ లోపలికి వెళ్తాడనా
  • మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

 

వేల్పూర్, బతుకమ్మ : రాష్ట్రంలో యూరియా కొరత  రోజురోజుకు తీవ్రతరం అవుతుంటే, రైతుల గోస పట్టని ఎం. పీ లు ఉండి లాభం లేదని, యూరియా సమస్యకు భాద్యత వహిస్తూ ఎం. పీ లు వెంటనే. రాజీనామా చెయ్యాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ఎం. పి లను డిమాండ్ చేశారు. బుధవారం ఆయన వేల్పూర్ మండల కేంద్రంలోని తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నెలరోజుల్ నుంచి బిఆర్ఎస్ పార్టీ యూరియా విషయమై అన్ని వేదికల మీద ప్రభుత్వాని హెచ్చరిస్తున్న, రేవంత్ రెడ్డిని తిడుతున్న,  శాపనార్థాలు పెడుతున్న కూడా ఇప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వానికి నాయకులకు కళ్ళు కనిపిస్తలేదా అని ప్రశ్నించారు. యూరియా కోసం రైతు అన్నం లేకుండా, నిద్రాహారాలు లేక గంటల తరబడి పడిగాపులు పడుతున్న ,చెప్పులు లైన్లో , పాస్ బుక్ లు లైన్ లో పెట్టే పరిస్థితి దాపూరించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  రైతాంగం ఇబ్బంది పాలవుతున్నప్పటికీ చీమ కుట్టినట్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని,  నిజామాబాద్, బాల్కొండ నియోజకవర్గం లో అన్ని గ్రామాల్లో యూరియా కోసం రైతులు కష్టాలు పడుతున్నారన్నారు. తండాల్లో నుంచి వచ్చి యూరియా తీసుకుపోవడానికి ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వానికి కనబడడం లేదన్నారు. కానిస్టెన్సీ లోని సొసైటీల వారిగా ఇండెంట్లు పెడితే బాల్కొండ మండలంలో 100 సంచులు వచ్చాయని, ఈ వచ్చిన యూరియా సంచులను 10 గ్రామాలకు ఎన్ని ఇస్తారన్నారు. మెండోరా, వేల్పూరు మండలంలో 1 వెయ్యికి గాను 90 సంచులు వచ్చాయని,ఆ అరకొర వచ్చిన సంచులను రైతులకు ఏలేక్కాన పంచుతారన్నారు.   మోర్తాడ్ మండలం డోన్ పాల్ గ్రామంలో  పోలీసులను పెట్టీ టోకెన్లు పంపినీ చేశారని, చరిత్రలో ఎప్పుడైన ఇలా జరిగింద అని, తోర్తి గ్రామంలో కూడా ఇదే కష్టాలు ఉన్నాయన్నారు. ఢిల్లీకి మూటలు పంపడం తప్ప సీ. ఎం కు వేరే ధ్యాస లేదని, కమీషన్లు దండుకోవడం మీదనే దృష్టి పెట్టారని,  ప్రజల, రైతుల కష్టాలు మాత్రం పట్టవన్నారు.  యూరియా రైతులకు ఎంత అవసరం వుండే ? ముందే లెక్కలు తీసి కేంద్రానికి పంపించాల్సి ఉంటుందని, అందుకు తగ్గట్టు కేంద్రం రాష్ట్రానికి యూరియా పంపించాల్సి ఉంటుందన్నారు. . కాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేక,  రైతులకు అవస్థలు ఎదురవుతున్నాయని, అవసరం ఉన్న యూరియాను కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎం. పీలు అడగడం తెలివి లేక ఈ కష్టాలు ఉన్నాయన్నారు.  యూరియా కొరతలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమాయ్యాయని, కాంగ్రెస్, బీజేపీ లకు 16 మంది ఎంపీలు ఉండి రైతులు ఇంత ఇబ్బంది పడితే ఎంపీలు ఏమి చేస్తున్నారని ఆయన అడిగారు. ప్రజలకు ఉపయోగపడని మీ పదవులు ఎందుకు ?  కాంగ్రెస్, బీజేపీ చేయడం వల్ల రైతులు రోడ్డున పడ్డారని,   రైతులు యూరియా కోసం అల్లాడుతుంటే అరవింద్ ఎక్కడికి వెళ్లాడన్నారు. పెద్ద  పెద్ద మాటలు, అడ్డగోలుగా తిట్టే అరవింద్ యూరియా ఎందుకు తెప్పించడం లేదని, మోడీ దగ్గర చాలా విలువ, పలుకుబడి ఉందని చెప్పే ఆయన యూరియా గురించి ఎందుకు మాట్లాడడం లేదన్నారు.బీజేపీ 8 మంది ఎంపీలు ఉన్నా ప్రయోజనం లేదనే, వెంటనే మోదీ దగ్గరికి వెళ్ళి యూరియా తీసుకురావాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.కేసీఆర్ ప్రభుత్వంలో ఏనాడు ఇలా చూడలేదని, కేసీఆర్ దూర దృష్టి వల్ల రైతులకు పదేండ్లు స్వర్ణ యుగంగా విలసిల్లిందన్నారు. కేసీఆర్ ముందుగానే లెక్కలు వేసి కేంద్రానికి,మంత్రుల బృందాన్ని పంపి యూరియా తెప్పించే వారన్నారు. రైతులు యూరియా కోసం ఇంత గోస పడుతుంటే ఎంపీలు గాడిద పల్లు తోముతున్నారా ఏంటి అని ఆయన ఏద్దేవా చేశారు. యుద్ధం వల్ల  యూరియా అందడం లేదని ఒక ఎంపీ మాట్లాడుతున్నాడని, పనికి మాలిన యుద్ధం వలన యూరియా కొరత వచ్చిందని సిగ్గులేని మాటలు మాట్లాడడం సిగ్గు చెటన్నారు. ముందుచూపు లేక యూరియా కొరత వస్తే పెద్ద పెద్ద రైతులు కొరతకు కారణం అవుతున్నారని ఓ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడడం రైతులు విని నవ్వుకుంటున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీ లు మోడీ దగ్గరికి వెళ్ళి యూరియా తీసుకురావాలని లేనిపక్షంలో రైతులు తిరగబడితే ఎంపీలు రాజీనామా చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. యూరియా బస్తా ఇప్పించలేని అసమర్థ పాలకులు. మోడిని నిలదీసే ధైర్యం లేని కాంగ్రెస్ ఎంపీలు ఎందుకన్నారు. బడే భాయ్ కు కోపం వస్తుందా ? చోటే భాయ్ కి ఇబ్బంది కలుగుతదనా ?  కాంగ్రెస్ ఎం. పీ లు మాట్లాడడం లేదన్నారు.రైతుల బాధలు తీర్చలేనప్పుడు ఎందుకు ఆ ఎంపీ పదవులు ? రేవంత్ రెడ్డి బెయిల్ కాన్సిల్ అయి మళ్ళీ లోపలికి వెళ్తాడనా ?   కాంగ్రెస్ ఎంపీల భయం అని అన్నారు.యూరియా కోసం కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడంలేదు ? ప్రజలకు మేలు చేయని మీ ఎంపీ పదవులు ఎందుకు ? రాజీనామాలు చేయండన్నారు.మోడీ దగ్గర పలుకుబడి ఉంటే అరవింద్ ఢిల్లీకి వెల్లి నిజామాబాద్ కు సరిపడా యూరియా తీసుకురావాలని, నిజామాబాద్ జిల్లాకు 75 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అయితే 72 వేల యూరియా వచ్చిందని అధికారులు చెపుతున్నారన్నారు. మరి వచ్చిన యూరియా ఎటు వెళ్ళింది ? కాంగ్రెస్ నేతల బ్లాక్ మార్కెట్ కు వెళ్ళిందా? రైతులు స్టాక్ పెట్టుకుంటున్నారు అని కాంగ్రెస్ నేతలు, అధికారులు అంటున్నడం శోచనీయమన్నారు.రైతు ఏమైనా యూరియా తింటాడా ? అబద్ధాల లెక్కలు చెప్పుతూ, యూరియా సరఫరా చేసే సత్తా లేక , యూరియా తెప్పించే తెలివిలేక కాంగ్రెస్, బీజేపీ ఎంపీలకు అవగాహన లేక రైతులు రోడ్డుపైన పడ్డారన్నారు. ఒక్కసారి కూడా రైతులకు కేసీఆర్ పాలనలో యూరియా కోసం లైన్ కట్టే దుస్థితి రాలేదని, రైతుకు యూరియా బస్తా ఇవ్వలేని అసమర్థ ఎంపీలు రాజీనామా చేయాలీ. పదవుల్లో ఉండడానికి అర్హత లేదన్నారు.ప్రెస్ మీట్ లో పార్టీ మండల ప్రెసిడెంట్ నగదర్ రెడ్డి, డోళ్ళ రాజేశ్వర్,మాజీ జడ్పిటీసీ చౌట్ పల్లి రవి, మాజీ జడ్పి కోఆపషన్ మెంబర్ మొయిజ్, షర్దల్ తదితరులు ఉన్నారు.

More articles

Latest article