24.1 C
Hyderabad
Saturday, August 1, 2026

రోడ్డు ప్రమాదంలో మామ, కోడలు మృతి

Must read

📰 Generate e-Paper Clip

మాక్లూర్, బతుకమ్మ :  బైక్ అదుపు తప్పి జరిగిన రోడ్డు ప్రమాదంలో మామ, కోడలు మృతి చెందారు.  ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.   నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని దాస్ నగర్ – మాక్లూర్ రోడ్డులో దుర్గానగర్ తండా సమీపంలో బుధవారం ఈఘటన చోటు చోసుకుంది.  వివరాల్లోకి వెళ్తే.. నందిపేట్ మండలం తల్వేద గ్రామానికి చెందిన నీరడి చింటూ (30) తన భార్య పూజ (25), తండ్రి నారాయణతో కలిసి మోటార్ సైకిల్‌పై నిజామాబాద్ వైపు వెళ్తున్నారు. బైక్ చింటూ నడుతున్నాడు. మార్గ మధ్యలో మాక్లూర్ – దాస్ నగర్ రోడ్డులో  బైక్ అదుపు తప్పి కింద పడటంతో నారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు.  చింటూ, పూజలకు గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. జిల్లా జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పూజ కూడా మృతి చెందింది. ప్రస్తుతం చింటూ చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై మాక్లూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article