27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

కాంగ్రెస్ పాలనలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది

Must read

📰 Generate e-Paper Clip

  • ఎంపీ పై ఇష్టిరీతిన మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతాం
  • మండల బీజేపీ ప్రెసిడెంట్ బేల్దారి నవీన్

 

వేల్పూర్, బతుకమ్మ : ఎన్నికల్లో అమలు కానీ హామీలను ఇచ్చి కాలం వెళ్ళాదిస్తున్న కాంగ్రెస్ పార్టీ అబద్దపు హామీలు, బీ సీ రిజర్వేషన్ల విషయంలో అబద్దాలు చెబుతూ గ్రామాల్లో సర్పంచ్ లు లేక అభివృద్ధి కుంటు పడుతుందని వీటన్నిటిని కారణం గా మొత్తం మీద కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిందని బీజేపీ మండల పార్టీ ప్రెసిడెంట్ బేల్దారి నవీన్, పార్టీ అసెంబ్లీ కన్వీనర్ మల్కాన్నగారి మోహన్ లు ఆరోపించారు. ఎం. పీ అరవింద్ పై డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మండల పార్టీ కార్యాలయం లో సోమవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ పై మానాల ఇష్టానుసారంగా  మాట్లాడటం సరైంది కాదని, ఇష్టరీతిన మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతామన్నారు. మీ కాంగ్రెస్ పాలనలో లాండ్ ఆర్డ‌ర్‌ గడితప్పిందని, మా ఎం.పీ చొరవ తీసుకొనేంతవరకు కూడా నవీపేటలో ఒక వర్గం వారిపై పోలీసులు ఎలాంటి చర్యలకు తీసుకోలేదని, గణపతి నిమజ్జనం వేళలో ఫోటో తీయడం వల్ల వచ్చిన ఫోటోతో మా హిందూ యువకుడిపై ఆగ మేఘాల మీద ఎఫ్ ఐ ఆర్ ఫైర్ చేసి రిమాండ్ కు పంపడం అనేది కాంగ్రెస్ పార్టీ ఒక వర్గం వారికి సప్పోర్ట్ చేయ్యడం ఉండడం వల్లనే కదా!  ఆ ర్యాలీకి ఉసికొల్పి అక్కడ ప్రజలను భయాందోళన కు గురి చేసిన  వారిని  ఇంకా ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు.ఎఫ్ ఐ ఆర్ ఎందుకోసం చేయలేదన్నారు. ఈకాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని,దేశం నుండి బహిష్కరించిన ఉగ్రవాదులను  రాహుల్ గాంధీ విదేశాలలో దొంగ చాటున కలవడం వెనుక మతలబు ఏంటిన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి  రావడం కోసం అనేక రకాలుగా హామీలు ఇచ్చి అధికారం ఎక్కిన రేవంత్ రెడ్డి , ముఖ్యమైన హామీలను నెరవేర్చకుండా కాలం వేల్లదిస్తున్నారని ఏద్దేవా చేశారు.అందులో ఒకటి బీసీ డిక్లరేషన్. బీసీల కోసం మేము ముందు ఉన్నాం అంటూనే బీసీలను రాజకీయంగా అడ్డుకుంటున్నారన్నారు. మీకు  నిజంగా బీసీల పైన ప్రేమ ఉంటే 42% రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్ పెట్టాలని, ఎలక్షన్ లేక సర్పంచ్ లేక గ్రామాలలో అభివృద్ధి కుటుపడుతొందన్నారు. ఎక్కడికక్కడ మురికివాడళ్లగా తయారయ్యాయని, ప్రజలు రోగాల బారిన  పడుతున్నారన్నారు. ఈ లోపల ఎలక్షన్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్పి మీ కాంగ్రెస్ నాయకులను ఎక్కడికి అక్కడ ఊర్కించే  రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వారు జోష్యం పలికారు. ఉపరాష్ట్రతి అభ్యర్థి బీసీ వర్గానికి చెందిన అభ్యర్థిని ప్రకటించలేదని, కనీసం బరిలో ఉన్న బీసీ అభ్యర్థికి కైనా మద్దతు తెలుపలేదని వారు దుయ్యబట్టారు.ఈ కాంగ్రెస్ పార్టీ బీసీ ల ఓట్లు తీసుకొని బీసీ లను మోసం చేసిందని, బీజేపీ పార్టీ ఉపరాష్ట్ర పతి అభ్యర్థిగా ఒక బీసీ కి అవకాశం యిచ్చి, ఉపరాష్ట్ర పతిని చేసిందని తెలియజేశారు. ఇది బీజేపీ కి బీసీ లపైన ఉన్న చిత్తశుద్ధి, ప్రేమకు నిదర్శనమన్నారు.రైతులకు కావాల్సిన యూరియా కేంద్రం ఎప్పుడు అనుకున్న సమయానికి సరఫరా చేస్తూనే ఉందని, ఇక్కడ శాఖల సమన్వయ లోపం వల్ల యూరియా పంపకంలో జాప్యం జరుగుతున్న వాస్తవాన్ని  స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రకటనలు చెప్పడం జరిగిందన్నారు.  తన యొక్క సీఎం కుర్చీని కాపాడుకోవడానికి ఆయన చేస్తున్న ముందు చూపు ఢిల్లీ ప్రయాణాలు కాస్త తగ్గించి, రైతుల అవసరాలపైన ముందుచూపు పెడితే నేడు రైతులకు ఈ యూరియా కష్టాలు రాకుండెవన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఎంత అడిగితే అంతా  ఎరువులను కేంద్రం సరఫరా చేస్తుందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు వల్లనే ఈ యూరియా కష్టాలలు ఉత్పన్నం అవుతున్నాయని అన్నారు.బ్లాక్ మార్కెట్ లోకి యూరియా వెళ్ళకూడదనే ఉద్దేశ్యం తో వేప పసరు కలిపిన యురియను నరేంద్ర మోడీ రైతులకు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ఈ ప్రెస్ మీట్ లో జిల్లా కార్యదర్శి నోముల నర్సారెడ్డి , మండల ఉపాధ్యక్షులు జెల్లా ప్రవీణ్ , బద్దం రాజారెడ్డి, యేళ్ళ రమేష్,, రమేష్, జే కృష్ణారెడ్డి, సంగేపు రమేష్,జంగన్న,అన్వేష్ లు పాల్గొన్నారు.

More articles

Latest article