24 C
Hyderabad
Sunday, August 2, 2026

తహసీల్దార్ కార్యాలయం ఎదుట వికలాంగుల నిరసన

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో వికలాంగులకు రూ. 6 వేలు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులకు రూపాయలు 6000 పెన్షన్  పెంచాలని రుద్రూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం వికలాంగులు నిరసన వ్యక్తం చేసి తహసీల్దార్ తారాబాయికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వికలాంగుల జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగులకు, వృద్ధులకు ఎన్నికల్లో 6000 రూపాయలు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ హామీని నెరవేర్చడం లేదని తీవ్రంగా మండిపడ్డారు. కావున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగులకు 6000 రూపాయలు పెన్షన్  ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనియెడల  వికలాంగులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వికలాంగులు, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.Disabled protest in front of the Tahsildar's office

More articles

Latest article