27.2 C
Hyderabad

ఎస్సారెస్పీని సందర్శించిన హైకోర్టు న్యాయమూర్తులు

Must read

📰 Generate e-Paper Clip

 

మెండోరా, బతుకమ్మ :

నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ లో గల శ్రీరాంసాగర్ ప్రాజెక్టును  రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.సామ్ కోషి, జస్టిస్ సృజన శనివారం సందర్శించారు.

High Court judges visit SSRSP

పొరుగున ఉన్న నిర్మల్ జిల్లాలో పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఎస్సారెస్పీని సందర్శించిన హైకోర్టు న్యాయమూర్తులను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన అనంతరం, హైకోర్టు జడ్జిలు కలెక్టర్ తో భేటీ అయ్యి ఎస్సారెస్పీ ప్రాజెక్టు గురించి, జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.

High Court judges visit SSRSP

More articles

Latest article