28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

రాజంపేట ఎస్ హెచ్ఓ సస్పెన్షన్

Must read

📰 Generate e-Paper Clip

  • ఇద్దరు హోంగార్డుల పై వేటు వేసిన ఎస్పీ

 

 కామారెడ్డి, బతుకమ్మ: విధి నిర్వహణలో నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యంపై కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కన్నెర్ర చేశారు. కామారెడ్డి జల్లా రాజంపేట పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారిని, కామారెడ్డి, దేవుని పల్లి పోలీస్ట్ స్టేషన్ లలో పనిచేస్తున్న ఇద్దరు హోంగార్డులను సస్పెండ్ చేస్తు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజంపేట ఎస్ హెచ్ఒ దత్తాధ్రి గౌడ్,  దేవుని పల్లి పోలీస్ స్టేషన్ హోంగార్డు మోగులయ్య (655),  కామారెడ్డికి చెందిన హోంగార్డు సత్యనారాయణ (715) లను సస్పెన్షన్ చేస్తు ఆదేశాలు జారీ చేశారు. రాజంపేట మండలంలో గణేష్ నిమజ్జన సమయంలో విధులలో తీవ్ర నిర్లక్ష్యం వహించినందుకు దత్తాధ్రి గౌడ్ ను ఎఆర్ హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేస్తు, విఆర్ లో ఉన్న ఎస్ఐ ఎన్.రాజును రాజంపేట ఎస్ హెచ్ఓ గా అటాచ్ మెంట్ ఉత్తర్వులు జారీ చేశారు. మోగులయ్య ఎలాంటి అనుమతులు లేకుండా విధులకు గైర్హజరు కావడమే కాకుండా రాజకీయ కార్యకలాపాలలో పాల్గొంటున్నందుకు సస్పెండ్ చేశారు. గణేష్ నిమజ్జన బందోబస్తు డ్యూటీకి గైర్హాజరైనందుకు విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు. ప్రజలలో పోలీస్ శాఖ పట్ల విశ్వాసం నిలబెట్టేందుకు బాధ్యతయుతంగా విధులు నిర్వహించాలని, నిర్లక్ష్యం చేస్తే వేటు తప్పదని ఎస్పీ రాజేష్ చంద్ర హెచ్చరించారు.

Rajampet police suspended

More articles

Latest article