26.2 C
Hyderabad
Monday, August 3, 2026

రక్షణ శాఖ భూములు బదలాయించాలని వినతి

Must read

📰 Generate e-Paper Clip

డిల్లీ, బతుకమ్మ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా బుధవారం ఆయన రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుకు 98.20 ఎక‌రాల ర‌క్షణ శాఖ భూములు తెలంగాణ ప్రభుత్వానికి బ‌ద‌లాయించాల‌ని రాజ్ నాథ్ సింగ్ కోరారు. మూసీ – ఈసా న‌దుల సంగ‌మ స‌మీపంలో గాంధీ స‌ర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణాన్ని చేప‌ట్టనున్నట్లు తెలియజేశారు. జాతీయ స‌మైక్యత‌… గాంధేయ విలువ‌ల‌కు సంకేతంగా గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్ట్ నిలుస్తుంద‌ని కేంద్ర మంత్రికి వివరించారు.

చాకలి ఐలమ్మకు రేవంత్ నివాళి

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాక‌లి ఐల‌మ్మ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆమె చిత్రప‌టానికి సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్ పూల‌మాల వేసి నివాళులు అర్పించారు. సమ్మక్క, సారలమ్మ, చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించినట్లు సీఎం  తెలిపారు.

Request to transfer lands of the Defense Department

More articles

Latest article