24.1 C
Hyderabad
Monday, August 3, 2026

బీజేపీ అనుబంధ మోర్చాల అధ్యక్షుల నియామకం

Must read

📰 Generate e-Paper Clip

హైద్రాబాద్, బతుకమ్మ : భారతీయ జనతాపార్టీ అనుబంధ విభాగాల ( మోర్చా)లకు నూతన రాష్ట్ర అధ్యక్షులను ఎన్నుకున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా ఆదేశాల మేరకు రాష్ట్రంలోని  7 మోర్చాల అధ్యక్షులను ఎన్నుకున్నారు. మహిళా మోర్చా అధ్యక్షురాలిగా డాక్టర్ శిల్పా రెడ్డి, యువ మోర్చా అధ్యక్షులుగా గణేష్ కుందే, కిసాన్ మోర్చా అధ్యక్షులుగా బస్వాపురం లక్ష్మి నర్సయ్య, ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా క్రాంతి కిరణ్, ఎస్టీ మోర్చా అధ్యక్షులుగా నేనావత్ రవి నాయక్, ఓబిసీ మోర్చా అధ్యక్షులుగా గందమళలి ఆనంధ్ గౌడ్, మైనార్టీ మోర్చా అధ్యక్షలుగా సర్ధార్ జగ్మోహన్ సింగ్ లను ఎంపిక చేసినట్టు రాష్ట్ర అధ్యక్షులు రాంచంధర్ రావు తెలిపారు.

  • బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా బస్వా లక్ష్మినర్సయ్య..

భారతీయ జనతాపార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా నిజామాబాద్ జిల్లా కు చెందిన బస్వాపురం లక్ష్మి నర్సయ్య నియమితులు అయ్యారు. నిజామాబాద్ నగరానికి చెందిన లక్ష్మి నర్సయ్య గతంలో పార్టీ జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. ప్రస్తుతం లక్ష్మి నర్సయ్య బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పనిచేస్తున్నారు. బస్వా లక్ష్మి నర్సయ్య తనను కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షలుగా నియమించిన పార్టీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా, రాష్ట్ర అధ్యక్షులు రాంచంధర్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. వ్యవసాయానికి, పంటల సాగుకు ప్రసిద్ధి చెందిన ఇందూర్ జిల్లాకు రాష్ట్ర కిసాన్ మోర్చ అధ్యక్ష పదవిని కేటాయించినందుకు క్రుతజ్ణతలు తెలిపారు.

Appointment of presidents of BJP affiliated fronts

More articles

Latest article