రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండలం జేఎన్సీ కాలనీలో నిరుపేద కుటుంబానికి చెందిన గైని అర్చన వాళ్ళ అమ్మమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఇల్లు లేక, తినడానికి తిండి లేక దినంగా ఉందని, స్థానిక బిజెపి నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న బాన్సువాడ బిజెపి నాయకులు ఎన్నారై కోనేరు శశాంక్ తక్షణమే స్పందించి వారి కుటుంబీకులను పరామర్శించి తన వంతుగా 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా జేయన్సీ కాలనీలో కొంతమంది ఇల్లులు వర్షాలకి కురుస్తూ వర్షం నీళ్లు ఇంట్లోకి వచ్చి ఇబ్బందులు పడుతున్న విషయాన్ని జేయన్సి కాలనీ ప్రజలు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ దృష్టికి తీసుకురాగా రేపు వాళ్ళందరికీ ఇంటి పైన కప్పుకోవడానికి టార్పాలిన్ పట్టాలను ఇప్పిస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గం సీనియర్ నాయకులు మార్కెల్లి ప్రకాష్ పటేల్, రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ఉపాధ్యక్షులు యంవి .కృష్ణంరాజు, ప్రధాన కార్యదర్శులు ఏమూల గజేందర్, వడ్లసాయినాథ్, బీజేవైఎం మండల అధ్యక్షులు కుమ్మరి గణేష్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు బేగర్ శివప్రసాద్, మండల కార్యదర్శి గాండ్ల శివ, కోశాధికారి కటిక రామరాజు, బూత్ అధ్యక్షులు బైండ్ల సంజీవ్, మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
