25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

జోనల్ లెవల్ ఫారెస్ట్ స్పోర్ట్స్ షురూ

Must read

📰 Generate e-Paper Clip

Zonal Level Forest Sports Shuru

. ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

. పాల్గొన్న నాలుగు జిల్లాల అధికారులు, సిబ్బంది

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: అటవీశాఖ ఆధ్వర్యంలో జోనల్ లెవెల్ ఫారెస్ట్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్ -2024  శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రలోని రాజారామ్ స్టేడియంలో ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా హాజరైన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ క్రీడాపోటీలను ప్రారంభించారు. ఆయా జిల్లాల నుంచి వచ్చిన ఫారెస్ట్ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన, పతాకావిష్కరణ చేసి స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిత్యం పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతూ అడవులను కాపాడుతున్న ఫారెస్ట్ సిబ్బంది అభినందనీయులని అన్నారు. నిజామాబాద్ జిల్లా అంటేనే క్రీడలకు పెట్టింది పేరని జిల్లా నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన నిఖత్ జరీన్, యెండల సౌదర్య క్రీడాకారులున్నారన్నారు. జిల్లాలో స్పోర్ట్స్ ట్రాక్స్ నిర్మాణం, ఇండోర్ స్టేడియంల నిర్మాణం, మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. ఇవే అంశాలపై అసెంబ్లీలో ప్రస్తావించినట్లు తెలిపారు. తన హయాంలో తప్పకుండ పాత కలెక్టర్ గ్రౌండ్ లో ట్రాక్, ఇండోర్ స్పోర్ట్స్  స్టేడియం నిర్మాణం, రాజారామ్ గ్రౌండ్ లో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు. మొదటి రోజు నిర్వహించిన టగ్ ఆఫ్ వార్, కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, ఇండోర్ గేమ్స్ లో ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి,నిజామాబాద్ జిల్లాలకు చెందిన అటవీశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సీసీఎఫ్ శర్వాణన్, ఆదిలాబాద్, నిజామాబాద్ డీఎఫ్ వోలు ప్రశాంత్ పాటిల్,  నిఖిత, ఎఫ్ డీవో సుధాకర్, ఎఫ్ ఆర్ వోలు సంజయ్ గౌడ్, రవి మోహన్ భట్ తదితరులు హాజరయ్యారు.

More articles

Latest article