28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

జెల్లా భరత్ కు ఆదె ప్రవీణ్ కుమార్ సాయం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని ముదిరాజ్ వీధిలో జేల్లా భరత్ గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న నిజామాబాద్ (ఇందూర్) సర్వసమాజ్ కమిటీ కో. కన్వీనర్, నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదే ప్రవీణ్ కుమార్ రెండు నెలలకు సరిపడా బియ్యం, పప్పులు, కారం, పసుపు, నూనె, చక్కెర ఇంకా ఇతర నిత్యావసర సరుకులు అందించడంతో పాటు కొంత మొత్తం నగదును అందించారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. ఈ సందర్బంగా ఆదే ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వ పెద్దలు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మహామ్మద్ షబ్బీర్ అలీ  జేల్లా భరత్ ఆరోగ్య పరిస్థితి కుదుటపడుట కోరకు సహాయం చెయ్యడానికి ముందుకు రావాలని కోరారు. వారి ఆరోగ్య పరిస్థితి కూదుటా పడటం కోసం సరియైన వైద్య సహాయం అందించడానికి సహాయ పడాలని కోరారు. నిజామాబాద్ నగరం ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా వారికీ తోచిన సహాయం వెనువెంటనే అందించాలని కోరారు. ఈ కార్యక్రమం లో తెలంగాణా ఉద్యమకారులు ఈర్ల శేఖర్, జండా బాలాజీ గుడి డైరెక్టర్ వేముల దేవిదాస్, మాజీ కౌన్సిలర్ కోనేరు సాయి కుమార్, మోస్రా నారాయణ మరియు పెద్ద ఎత్తున అక్కడి మహిళలు పాల్గొన్నారు.

More articles

Latest article