28.8 C
Hyderabad
Monday, August 3, 2026

మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం

Must read

📰 Generate e-Paper Clip

  • డ్వాక్రా మహిళలు సిండికేట్ అయి వ్యాపారం చేయాలి
  • రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో 20 వేల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు తీసుకొని,సున్నా వడ్డీ తో లక్షలకోట్లు ఐదు సంవత్సరలల్లో  కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్షమని  నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం క్యాంపు కార్యాలయంలో  ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళను ఉద్దేశించి మాట్లాడుతూ   నియోజకవర్గంలోని వివిధ మండలలకు సంబంధించిన 200 కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను  పంపిణీ చేయడం జరిగిందని రూరల్ ఎమ్మెల్యే పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మహిళలకు పెద్దపీట వేసిందని అన్నారు. ప్రతి సంక్షేమ పథకాలు మహిళలకే ఇస్తున్నామని, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, ఐకెపి ద్వారా మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ ఇల్లు,రేషన్ కార్డులు, వంటి సంక్షేమ పథకాలు మహిళకే ఇస్తున్నామని అన్నారు. డ్వాక్రా  గ్రూపుల్లో 60 సంవత్సరాలు దాటిన తర్వాత మహిళను తీసేసేవారు. ఇప్పుడు 60 సంవత్సరాలు దాటిన మహిళలకు  కూడా రుణాలు  ఇస్తున్నామని అన్నారు. కొత్త గ్రూపులో కూడా మహిళలు చేరి రుణాలు తీసుకోవచ్చని అన్నారు. ఇంద్రమ్మ ఇల్లు కట్టుకున్న వారికి డబ్బులు లేకపోతే డ్వాక్రా గ్రూపుల ద్వారా లక్ష రూపాయలు ఇస్తున్నామని, మహిళలు వ్యాపారం చేసుకోవడానికి సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడానికి డ్వాక్రా గ్రూపులో మహిళలు సిండికేట్ అయి సోలార్ ప్లాట్ ను ఏర్పాటు చేసుకొని విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి అద్దెకు ఇవ్వాలని అన్నారు. డ్వాక్రా గ్రూపులో మహిళలు సిండికేట్ అయిన తర్వాత  బస్సులను కొని, ఆర్టీసీకి అద్దెకు ఇవ్వచ్చని అన్నారు. త్వరలో మహిళా మాటలను ఏర్పాటు చేస్తున్నామని, హైదరాబాదులో హైటెక్ సిటీలో ఉన్న శిల్పారామంలో వద్ద మూడు ఎకరాల భూమిని ఏర్పాటుచేసి తెలంగాణ వంటలను తయారుచేసి అమ్ముకోవచ్చని అన్నారు.  నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లోని  మహిళలు మునుముందు ఆలోచించి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ ముప్పగంగారెడ్డి, డిచ్పల్లి, ఇందల్వాయి, జక్రాన్ పల్లి, సిరికొండ, మోపాల్, నిజామాబాద్ రూరల్, ధర్పల్లి మండలాల తహసిల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, ఐసిడిఎంఎస్ చైర్మన్ తార చందు నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పోలసాని శ్రీనివాస్, డిచ్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమృతపూర్ గంగాధర, నిజామా బాద్ రూరల్ యూత్ నాయకులు ఉమ్మాజీ నరేష్, ఇందల్వాయి  మండల అధ్యక్షులు నవీన్ గౌడ్, మోపాల్ మండల అధ్యక్షులు సాయ రెడ్డి, జక్రాన్ పల్లి అధ్యక్షులు చిన్నారెడ్డి, ధర్పల్లి మండల  అధ్యక్షులు బాల్రాజ్, నిజామాబాద్ రూరల్ మండల అధ్యక్షులు ఎల్లయ్య, ఖానాపూర్ డివిజన్ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్, గ్రామ శాఖ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

The government's goal is to make women millionaires.

More articles

Latest article