26.2 C
Hyderabad
Monday, August 3, 2026

పంట నష్టపోయిన రైతులకు భరోసా

Must read

📰 Generate e-Paper Clip

  • కలెక్టర్‌ను కలిసిన బీజేపీ నాయకులు

 

బతుకమ్మ బోధన్ : బోధన్ మండలంలోని కల్దుర్కి, సిద్ధాపూర్, ఖండ్‌గాం, భిక్నెల్లి గ్రామాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా విపరీతంగా పంటలు దెబ్బతిన్నాయి. ఈ గ్రామాల రైతులను పరామర్శిస్తూ, వారికి మనోధైర్యం నింపుతూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డి మోహన్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం పంట నష్టాన్ని గుర్తించి, ఎకరానికి రూ.30,000 పరిహారం చెల్లించాలి అని డిమాండ్ చేశారు. రైతులందరూ తమ పంట నష్టాలను వ్యవసాయ అధికారుల వద్ద తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఖండ్‌గాం గ్రామంలో పంట నష్ట వివరాలను నమోదు చేస్తున్న అధికారిని కలిసి, ప్రతి రైతుకూ నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్బంగా, గ్రామాల రైతులు మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చిన సమస్య ఏమిటంటే – పంట నష్టం నమోదు చేసే సమయంలో “బోనస్ రాదు, ప్రభుత్వం ధాన్యం కొనదు” అన్న షరతుతో డిక్లరేషన్ ఇస్తున్నారని తెలిపారు. వెంటనే స్పందించిన మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ను ఫోన్‌లో సంప్రదించి ఎలాంటి కండిషన్లు పెట్టకుండా నష్టపరిహారం చెల్లించాలనీ కోరారు. దీనికి స్పందించిన జిల్లా కలెక్టర్ రైతులకు భరోసా ఇచ్చారు. “33% కంటే ఎక్కువ నష్టం జరిగిన రైతులకు పంటలెక్కల ప్రకారం నష్టపరిహారం తప్పకుండా ఇస్తాం. వరి కొనుగోలు లేదా బోనస్ విషయంలో ఎలాంటి డిక్లరేషన్ తీసుకోమని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తాం” అని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ నిర్ణయంపై రైతులు కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా ఇన్‌చార్జ్ కూరెళ్ల శ్రీధర్, మండల బీజేపీ అధ్యక్షులు సిర్ప సుదర్శన్, ప్రధాన కార్యదర్శులు దొనకంటి లక్ష్మారెడ్డి, జంగం వెంకటేష్, మాజీ మండల అధ్యక్షులు రాజురె మనోహర్, మాజీ ప్రధాన కార్యదర్శి జిల్కరి ప్రవీణ్, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకులు, బూత్ అధ్యక్షులు, శక్తికేంద్ర ఇన్‌చార్జీలు, రైతులు పాల్గొన్నారు.

Assurance to farmers who lost their crops

More articles

Latest article