పంట నష్టపోయిన రైతులకు భరోసా
కలెక్టర్‌ను కలిసిన బీజేపీ నాయకులు బతుకమ్మ బోధన్ : బోధన్ మండలంలోని కల్దుర్కి, సిద్ధాపూర్, ఖండ్‌గాం, భిక్నెల్లి గ్రామాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా విపరీతంగా పంటలు దెబ్బతిన్నాయి. ఈ గ్రామాల రైతులను పరామర్శిస్తూ, వారికి మనోధైర్యం నింపుతూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డి మోహన్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం పంట నష్టాన్ని గుర్తించి, ఎకరానికి రూ.30,000 పరిహారం చెల్లించాలి అని డిమాండ్ చేశారు. రైతులందరూ తమ పంట నష్టాలను వ్యవసాయ...