- బిఆర్ఎస్ నాయకుడు కంచర్ల రవి గౌడ్
రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ:తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను బదునాం చేయాలనే దురుద్దేశంతో కాలేశ్వరం ప్రాజెక్టును సిబిఐ విచారణకు అప్పగించడం చాలా దురదృష్టకరమని బిఆర్ఎస్ నాయకుడు కంచర్ల రవి గౌడ్ అన్నారు. సిరిసిల్ల తెలంగాణ భవన్ లో ఏర్పాటు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవి గౌడ్ మాట్లాడుతూ“కాలేశ్వరం ప్రాజెక్టు అనేది తెలంగాణకు జీవాధారం. రైతు కళ్లల్లో ఆనందం నింపిన ప్రాజెక్టని అలాంటి అద్భుత ప్రాజెక్టుపై సిబిఐ విచారణ అనడం అంటే తెలంగాణ రైతు హృదయాన్ని దెబ్బతీయడమేనన్నారు. రైతుకు నీళ్లు అందించిన ఘనత కేసీఆర్ గారిదేనని, అలాంటి మహానేతను ఎలాగైనా బదునాం చేసి, తెలంగాణలో బిఆర్ఎస్ ఉనికిని కూల్చేయాలనే కుట్రలు జరుగుతున్నాయని కానీ తెలంగాణ ప్రజలు వాటిని గుర్తిస్తున్నారని ” అని అన్నారు.కాంగ్రెస్ పార్టీ సాక్షిగా కాలేశ్వరం కమిషన్ పేరిట బురద జల్లడం అత్యంత దుర్మార్గమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “శాసనసభలో హరీశ్ రావు మాట్లాడుతుంటే 33 సార్లు అడ్డుకున్నారని వాస్తవము కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు డైరెక్షన్‌లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారన్నారు.కేసీఆర్ తెలంగాణ సాధించిన మహానాయకుడు రాష్ట్రం ఉన్నంత వరకు ఆయన తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తారు” అని రవి గౌడ్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు వడ్లూరి సాయి సూర్య, కాసర్ల శ్రీనివాస్, యశ్వంత్, అక్రమ్, మహేష్, మున్నా,వడ్లూరి వేణు, కోడం వెంకటేశం, పరకాల హర్షిత్, రాజు, తదితరులు పాల్గొన్నారు.
